చిలకలూరిపేట. ఆగస్టు 27 (రాజధాని వాయిస్) :చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి భౌతికకాయాలకు మాజీ మంత్రి రజిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని రజిని గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందిన పలువురు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని , ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన పలువురు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకమని, ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని వారి కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు.
అనంతరం చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు, ఒక బాలుడిని మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
0 Comments