కారంపూడి, ఆగస్టు 26 రాజధాని వాయిస్ :
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా గ్రామాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో బుధవారం ఉదయం సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కారంపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు, ఎస్సై వాసు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.గ్రామాల్లో అలజడులు సృష్టిస్తూ అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే కారంపూడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
0 Comments