కారంపూడి
ఆగస్ట్26
రాజదాని వాయిస్
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా కారంపూడికి చెందిన కిల్లా. రత్నకుమారి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం కిల్లా. రత్నకుమారి మరికొంతమందితో కలిసి మాచర్లలోని వైసీపీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకొని ధన్యవాదములు తెలిపారు. తనకు జిల్లా పదవి ఇప్పించడానికి సహకరించిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ని ఈ సందర్బంగా కిల్లా. రత్నకుమారి దంపతులు దుస్సాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పిఆర్కే నూతనంగా నియమితులైన పల్నాడు జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కిల్లా. రత్నకుమారి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ పదవికి వన్నె తెచ్చేలా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషిచేసి అందరితో మమేకమై పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్బంగా పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి రత్నకుమారి ని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments