పిడుగురాళ్ల. రాజధాని వాయిస్ : ఆగస్టు 27
పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా కొత్త సాంబశివరావు, అధ్యక్షులుగా శేగు సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా కొత్త వెంకట వంశీ మోహన్ రావు, కోశాధికారిగా కాకుమాను అంజి బాబు, ఉపకోశాధికారిగా ఓబులశెట్టి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.సంఘం అభివృద్ధికి, ఆర్యవైశ్యుల సంక్షేమానికి మరియు సమాజ సేవా కార్యక్రమాల విస్తరణకు తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులకు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య కుల బాంధవులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
Be the first to share your thoughts on this story!