Wednesday, 26 August 2026
Telugu Daily
Header
BREAKING

వామ్మో దోమలతో అల్లాడిపోతున్నాం

డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న కారంపూడి

నాలుగు రోజుల నుండి విధులకు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు కారంపూడి. ఆగస్టు 24 రాజదాని వాయిస్ : మండల కేంద్రమైన కారంపూడిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. డంపింగ్ యార్డ్ గా తలపిస్తున్న ప్రధాన వీధులు, దేవాలయాలు, ముఖ్య కోడలు, బస్టాండ్ సెంటర్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. మురికి కాలువలలో మురుగు నీరు నిల్వ చేరింది. గత రెండు రోజులు ఉండి కురుస్తున్న వర్షాలకు చెత్తాచెదారం నుండి దుర్వాసన వెదజల్లుతుంది. వర్షపు నీరు మురికి కాలువలో చేరడంతో మురుగనీరు రోడ్లపై పారుతుంది. పారిశుద్ధ్య కార్మికులు తమ జీతాలు చెల్లించాలని గత నాలుగు రోజులు నుండి విధులకు బహిష్కరించారు.16 నెలల జీతాలు చెల్లించాలని గతంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు తెలిపారు. స్పందించిన ఆమె విచారణ చేసి జీతాలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి కారంపూడి విచ్చేసి పారిశుధ్య కార్మికులతో చర్చించారు.తక్షణమే పారిశుధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఏర్పాటుచేసి వారి ఖాతాలో జీతాలు చెల్లించే విధంగా చూడాలని జులై 27వ తేదీన పంచాయతీ అధికారులను ఆదేశించారు. అధికారులు జీతాలు చెల్లించకపోవడంతో ఆగస్టు 10వ తేదీన సమ్మె నోటీసును పంచాయతీ విస్తరణ అధికారి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఆగస్టు 15వ తేదీన బస్టాండ్ సెంటర్లో సమ్మెకు దిగారు. అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి మూడు నెలల జీతాలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. ఈనెల 19వ తేదీన జీతాలు చెల్లించకపోవడంతో 21వ తేదీ నుండి కార్మికులు సమ్మె బాట పడ్డారు.పరిశుద్ధ కార్మికులు విధులకు రాక పోవడంతో పట్టణంలో పారిశుద్ధ్యం లోపించినట్లు అయింది. *దోమలు విలయతాండవం* పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగు రోజులుగా విధుల్లో కి రాకపోవడంతో మురికి కాల్వలో మురుగనీరు నిల్వ చేరింది. దీంతో దోమలు భలే తాండవం చేస్తున్నాయి.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు మురుగు కాలవలో చేరి దుర్వాసనతో, దోమల బారిన పడవలసి వస్తుందని పట్టణ వాసులు అంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించాలని. వీధుల్లోకి కార్మికులు రావాలని ప్రజల కోరుకుంటున్నారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!