Telugu Daily
Wednesday, 26 August 2026
www.rajadhanivoice.in
మాచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
ముగ్గురికి తీవ్ర గాయాలు
మాచర్ల.
ఆగస్టు 25
రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌లపై ప్రయాణిస్తున్న కె. వెంకటేశ్వర్లు (50), ఎన్. శేఖర్ (22), సిహెచ్. ఆనంద్ (21) రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/మాచర్ల-వద్ద-ఘోర-రోడ్డు-ప్రమాదం
0 Comments