Wednesday, 26 August 2026
Telugu Daily
Header
BREAKING

పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల జీతాలు ఇస్తాం

- ప్రత్యామ్నాయంగా పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేస్తాం
- ఎంపీడీవో గంటా శ్రీనివాసరెడ్డి

కారంపూడి ఆగస్టు 26( రాజధాని వాయిస్)  మండల కేంద్రమైన కారంపూడిలో పారిశుద్ధ కార్మికులకు మూడు నెలల జీతాలు అడ్వాన్స్ గా ఇస్తున్నామని అంటున్నామని ఎంపీడీవో గంట శ్రీనివాస్ రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రతి నెల కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకొని జీతాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.కార్మికులు గత ఐదు రోజుల నుండి సమ్మెలో ఉన్నారు.కార్మికులు అడ్వాన్స్ జీతాలు ఇస్తామన్న విధులకు రాకపోతే ప్రత్యామ్నాయంగా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి,డివిజనల్ డెవలప్మెంట్ అధికారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితి కార్మికులు ప్రత్యామ్నాయ సిబ్బందిపై ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!