Thursday, 05 November 2026
Header1
BREAKING

వర్షాల వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Nov 2026, 05:01 PM
👁️ 35 views

తుఫాను విపత్తు అనంతరం వచ్చే వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఒత్తిడిని జయిద్దాం _ ఆరోగ్యంగా జీవిద్దాం!
ఆరోగ్య విస్తరణ అధికారి : శిఖా శాంసన్

తుఫాను అనంతరం సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. బుధవారం ఆయన క్రోసూరు మండలం గుడిపాడు ఆరోగ్య ఉపకేంద్ర కార్యాలయంలో జరిగిన తుఫాను విపత్తు అనంతర వ్యాధులపై అవగాహన మరియు జాతీయ ఒత్తిడి నివారణ దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను అనంతరం సంభవించే జ్వరము, విరోచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆహార కలుషితం ద్వారా వచ్చే వ్యాధులు మరియు నీటి కలుషితం ద్వారా వచ్చే వ్యాధులు, కీటక జనిత రోగాల నివారణ గూర్చి వివరించారు ఆహారం, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి భద్రతపై తగు జాగ్రత్త వహించాలన్నారు దగ్గు, జలుబు, గొంతు నొప్పి సాధారణ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు త్రాగునీటిని మరిగించి లేక క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే త్రాగాలన్నారు మాస్క్ వినియోగించాలన్నారు జ్వరము, విరోచనాల సమస్యల లక్షణాలపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనారోగ్యం సంభవిస్తే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను గాని ఆశా కార్యకర్తను గాని సంప్రదించాలన్నారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తిని ఎగతాళి చేయకూడదని, వారికి ధైర్యం చెప్పాలని, ఒక మంచి మాట, ఒక ఆప్యాయత, ఒక చిన్న పలకరింపు కూడా మరొకరి జీవితంలో ఆశా కిరణం కావచ్చని శాంసన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ దివ్య జ్యోతి మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామము చేయడం తగినంత నిద్ర పోవడం ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం, ఇతరులతో పోల్చుకోవడం మానుకోవటం వంటి చిన్న చిన్న మార్పులతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త దుద్దుల నిర్మల, ఆశా కార్యకర్త శివకుమారి తదితరులు పాల్గొన్నారు

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X