ఏఐటియుసి 107వ ఆవిర్భావ దినోత్సవం
పిడుగురాళ్ల.రాజధాని వాయిస్:
పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో నందు ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ఏఐటియుసి 107వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా పిడుగురాళ్ల డిపో నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా సిపిఐ మండల కార్యదర్శి ఏఐటీయూసీ సీనియర్ నాయకులు అక్కినపల్లి బాలయ్య జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ ఏఐటియుసి ఎర్రజెండా నీడన ఏకమవుదాం! కార్మిక హక్కుల పరిరక్షణకు కదం తొక్కుదాం!! భారత కార్మికవర్గ ఉద్యమ చరిత్రలో అక్టోబర్ 31 ఒక సువర్ణాధ్యాయం. పరాయి పాలనలోని తీవ్ర దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా యావత్ కార్మిక లోకాన్ని ఏకతాటిపైకి తెస్తూ 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో లాలా లజపతిరాయ్ అధ్యక్షులుగా, దివాన్ చమన్లాల్ ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆవిర్భవించిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కార్మికులను ఐక్యపరిచి, బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోయడంలో కీలకభూమిక పోషించింది ఎఐటియుసి, జాతీయ ఉద్యమంతో కార్మిక హక్కుల పోరాటాన్ని అనుసంధానించిన తొలి సంఘం ఎఐటియుసి, నేడు కార్మికులు అనుభవిస్తున్న 8 గంటల పని విధానం, కనీస వేతనాల చట్టం (1948), ట్రేడ్ యూనియన్ల చట్టం (1926), గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ వంటి మౌలిక చట్టాలన్నీ ఎఐటియుసి రక్తం చిందించి సాగించిన ఉద్యమాల ఫలితాలే అన్నారు. 106 వసంతాల పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 107వ సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ, కార్మిక హక్కుల విధ్వంసానికి వ్యతిరేకంగా సరికొత్త ఐక్య కార్యాచరణను నిర్మించాల్సిన చారిత్రక బాధ్యత మనపై ఉందన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ, ఆ తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలలోనూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రస్తుత పాలకులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చివేసి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను హరించి, యాజమాన్యాలకు | పూర్తి స్వచ్ఛనిచ్చేలా తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులను ఆధునిక బానిసత్వంలోకి నెడుతున్నాయిఅన్నారు. సమ్మెచేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కులను ఇవి నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు ఏపీ పి టి డి, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎస్ కె నాగూర్ వలి , జిల్లా అసిస్టెంట్ కార్యదర్శి, సింధు బ్రహ్మ రావు, జిల్లా నాయకులు షేక్ అమీర్ హంజా డిపో నాయకులు ఎస్ వెంకయ్య , వి. బాలు నాయక్ . షేక్ కరీం, కె భూపతిరావు , ఎం ఆర్ ఆంజనేయులు, రాయల ఆంజనేయులు , గ్యారేజీ నాయకులు ఏం జయ రాజు, పెయింటర్ మహేష్ ,డిపో లోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, శ్రామికలు, సూపర్వాజర్లు, అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!