Thursday, 05 November 2026
Header1
BREAKING

పశ్చిమగోదావరిలో యుధ్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 భీమవరం
📅 ప్రచురణ: 04 Nov 2026, 08:49 PM
👁️ 8 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

* భారీ వర్షంలోనూ అధికారులు, సిబ్బంది నిర్విరామ కృషి ప్రశంసనీయం * ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

భీమవరం, నవంబరు 4: రాజధాని వాయిస్ :
ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ పనుల పర్యవేక్షణా బాధ్యతలను ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటికి అప్పగించారు. ఈ సందర్భంగా సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసే అంశంపై విద్యుత్ శాఖ అధికారులతో సిఎండి శివశంకర్ లోతేటి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇంధనశాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విద్యుత్ సరఫరా పునరుర్ధరణ పనులను వేగవంతం చేశామని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలి కారణంగా 33కెవి సబ్- స్టేషన్లు-98, 33కెవి ఫీడర్లు- 67, విద్యుత్ స్తంభాలు-8,859 11కెవి ఫీడర్లు-475, 516 ట్రాన్స్ ఫార్మర్లు, 755 కి. మీ. మేరకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో జిల్లాలోని 6 పట్టణాలు, 20 మండలాల్లోని 409 గ్రామాలకు సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులకు వీలైనంత తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను అందించాలనే ధ్యేయంతో భారీ వర్షాన్ని, బలమైన గాలిని సైతం లెక్కచేయకుండా అధికారులు, సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను చేపట్టడంతో త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. బుధవారం సాయంత్రానికి 6 పట్టణాలు, 409 గ్రామాలకూ విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇక జిల్లాలో 17 వేల అక్వా సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడగా 14వేల సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించడం జరిగిందన్నారు. మిగిలిన అక్వా సర్వీసులతోపాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరఫరాను పునరుద్ధరించేందుకు గత వారం రోజులుగా భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్విరామంగా కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడైడా గృహ విద్యుత్ సర్వీసులకు విద్యుత్ సరఫరా లేనట్లయితే సరఫరా పునరుద్ధరణ కోసం వినియోగదారులు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబరు: 9490610152కు కాల్ చేయవచ్చని తెలియజేశారు. వెంటనే సరఫరా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X