Friday, 30 October 2026
Header1
BREAKING

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 29 Oct 2026, 09:48 AM
👁️ 6 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- పూజిత మహిళా సొసైటీ చైర్మన్ కోటేశ్వరి - అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, బ్యూటీ కేర్ కిట్ల పంపిణీ - సొసైటీపై వస్తున్న ఆరోపణలు నిరాధారం

విజయవాడ. రాజధాని వాయిస్ :

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే తమ ప్రధాన ధ్యేయమని పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్ చైర్మన్ కోటేశ్వరి తెలిపారు. విజయవాడలోని సొసైటీ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ, బ్యూటీ కేర్, వివిధ చేతివృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లతో పాటు స్వయం ఉపాధి కోసం అవసరమైన కుట్టు మిషన్లు, బ్యూటీ కేర్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సొసైటీ విస్తృతంగా సేవలందిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన చైర్మన్
సొసైటీ కార్యకలాపాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోటేశ్వరి మండిపడ్డారు.నిరాధార ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సొసైటీ పనితీరుపై ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా సంప్రదించి అధికారిక పత్రాలను పరిశీలించవచ్చని స్పష్టం చేశారు.గతపన్నెండేళ్లుగా సంస్థ ద్వారా, అంతకుముందు నుంచి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మహిళా అభ్యున్నతికే కృషి చేస్తున్నామని ఆమె గుర్తుచేశారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో మహిళలు ప్రస్తుతం స్వతంత్రంగా వ్యాపారాలు, దుకాణాలు నిర్వహిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నారని కోటేశ్వరి వెల్లడించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X