తెనాలి, అక్టోబరు 29 : రాజధాని వాయిస్ :
అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా వరి పంట నేలవాలిన తెనాలి మండలంలో పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గురువారం పర్యటించారు. సోమసుందర పాలెం,

కంచరపాలెం గ్రామాల్లో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడిన తరువాత నేరుగా పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పరిశీలించారు. వర్షం పడటం గాలి ఎక్కువగా రావడంతో వారిపై నేలకు ఒరిగిందని కొద్ది రోజులు పాటు ఇదే స్థాయిలో ఉంటే పంటలు దెబ్బతింటాయని రైతులు చెప్పారు. దీనిపై వెంటనే వ్యవసాయ అధికారులతో మాట్లాడి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలు అందించాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించి పంటలను రక్షించుకునే చర్యలు చేపట్టాలని కోరారు. నిలువ ఉన్న నీటిని తక్షణం బయటికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారుల ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలు కాపాడుకునే విధంగా తగిన రైతులకు సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. నీరు ఎక్కడ నిలువ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఎక్కడ నష్టపోకుండా నిరంతరం వారికి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. పంట నష్టాలు జరిగితే వాటి నివేదికను అందజేయాలని ఆదేశించారు.
వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తలు డా. సిహెచ్ సుజాని రావు, డా. ఎం రత్నం, డా. ఎన్. సాంబశివరావు ఇందులో పాల్గొని రైతులకు సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, తాసిల్దార్ గోపాలకృష్ణ వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!