*ఒరిగిన దుబ్బులను ఒకదానికి ఒకటి కలిపి కట్టుకోవాలి*
*వ్యవసాయ అధికారి పి.వెంకటప్పయ్య*
*రాజుపాలెం.రాజధాని వాయిస్:*
మండల వ్యవసాయాధికారి పి.వెంకట నరసయ్య ఆర్నాబ్ తుఫాన్ వల్ల వరి పంట క్షేత్ర స్థాయిలో ఏవిధంగా ఉన్నదో వివిధ గ్రామాలకు వెళ్లి పంట పొలాలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్నబ్ సైక్లోన్ వల్ల గాలికి కొన్ని చోట్ల కొద్ది విస్తీర్ణంలో వరి గింజ పాలుపోసుకోను, గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పొల్లాలు నేలకు ఒరిగి ఉన్నాయని, అలా ఒరిగిన వరి దుబ్బులను ఒకదానితో ఒకటి కలిపి కట్టలు కట్టుకోవాలని తెలిపారు. అదేవిధంగా గింజ గట్టి పడే పొలాల్లో నీటిని బయటకి పెట్టీ కట్టలు కట్టుకోవాలని తెలియజేశారు.ప్రస్తుతానికి మండలంలో పైరుకి ఎటువంటి నష్టం లేదని తెలిపారు.
Be the first to share your thoughts on this story!