Wednesday, 28 October 2026
Header1
BREAKING

తుపాను వేళ ప్రజల వద్దకు హోంమంత్రి అనిత

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 28 Oct 2026, 10:39 AM
👁️ 109 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- పునరావాస కేంద్రాల్లో వసతుల పరిశీలన.. వరాహ నదిలో నీటి ప్రవాహాన్ని సమీక్షించిన మంత్రి

రాజధాని వాయిస్':

అర్నబ్ తుపాను నేపథ్యంలో ప్రజల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.

WhatsApp Image 2026-10-28 at 10.33.46 AM.jpeg

ఈ పర్యటనలో భాగంగా ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అనిత, అక్కడ ప్రజలకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఆహారం, ఇతర సదుపాయాలు ఎలా అందుతున్నాయి, అధికారులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని, పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని గ్రామస్తులు మంత్రికి తెలిపారు.

WhatsApp Image 2026-10-28 at 10.33.46 AM (1).jpeg

అనంతరం ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ గ్రామ గ్రామాన పర్యటించిన మంత్రి, ఇదేశమ్మ వాక వద్ద నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్‌ను పరిశీలించారు. వరాహ నదిలో నీటి ప్రవాహ పరిస్థితులను కూడా స్వయంగా పరిశీలించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తుపాను పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X