Sunday, 22 November 2026
Header1
BREAKING

ఏకగ్రీవంగా ఎన్నికైన దుర్గి ఎంపీటీసీ నక్కనబోయిన కొండలుకు ఘన సన్మానం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 దుర్గి
📅 ప్రచురణ: 11 Nov 2026, 04:45 PM
🔄 నవీకరణ: 22 Nov 2026, 06:15 AM
👁️ 45 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

దుర్గి: నవంబర్ 11 రాజధాని వాయిస్ 
పల్నాడు జిల్లా దుర్గి మండల ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన నక్కనబోయిన కొండలు ముదిరాజ్‌కు మంగళవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మాడెబోయిన గురు ప్రసాద్, అఖిల భారత కోలి సమాజం రాష్ట్ర కార్యదర్శి, ఏపీ పీసీసీ సభ్యులు తూము శ్రీను ముదిరాజ్‌తో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని కొండలును అభినందించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ, దుర్గి గ్రామ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కొండలును ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంఘానికి గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని కొండలు ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దుర్గి గ్రామ అభివృద్ధికి ముదిరాజ్ సంఘం తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ నక్కనబోయిన కొండలు ముదిరాజ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుర్గి గ్రామ ప్రజలకు, తనకు అండగా నిలిచిన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్‌కు, సంఘ నాయకులకు, కులస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాడెబోయిన ఆంజనేయులు, నక్కనబోయిన వెంకటేశ్వర్లు, మాడెబోయిన కోటేశ్వరరావు, మాడెబోయిన శ్రీనివాస్, తూము వెంకటేశ్వర్లు, తూము కోటేశ్వరరావు, ఏసేబోయిన నాసారయ్య, తూము నాగేంద్రబాబు, ఏసేబోయిన ఏడుకొండలు, మమ్ము వెంకటేశ్వర్లుతో పాటు టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1