*నారాయణ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ*
సత్తెనపల్లి, నవంబర్ 21:రాజధాని వాయిస్:
సత్తెనపల్లి నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావు గారు హాజరై, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుకృషి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ గారు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడల ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం జానకి రామిరెడ్డి, పరిశోధన మరియు అభివృద్ధి విభాగం ప్రతినిధి స్వాతి లక్ష్మి , క్రీడా విభాగ సహాయ మేనేజర్ రవికిషోర్, జోనల్ సమన్వయకర్త గౌసియా బేగం, ఉపప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన, బోధనేతర సిబ్బందిని అభినందించారు.ముఖ్యంగా క్రీడా ఉపాధ్యాయులు అశోక్ విశేష కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Be the first to share your thoughts on this story!