దుర్గి, నవంబర్ 27, రాజధాని వాయిస్ :
మండల కేంద్రమైన దుర్గి లో సబ్ స్టేషన్ వెనుక ఇటీవల కాలంలో నిర్మించుకున్న తాటేకు గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్గి రాజేష్కోవడంతో పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన ఇంటి పక్క వాళ్ళు మాట్లాడుతూ రుద్రార రమేష్ తన తండ్రి వెంకటేశ్వర్లు తాటాకు గుడిసెను నిర్మించుకున్నారని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగి ఆ గుడిసెంత తగలబడి పోయిందని అలాగే ఆ గుడిసెలో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయని కాలిపోయిన వాటి వస్తువులు మరియు గుడిసె విలువ సుమారుగా నాలుగు లక్షల రూపాయలు విలువ చేస్తాయని తెలియజేశారు. తదనంతరం బాధిత కుటుంబం శోకసముద్రంతో విలపిస్తూ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించారు. అలాగే స్థానికులు కూడా ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.
Be the first to share your thoughts on this story!