- 52 పంచాయతీల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- డ్రోన్ కెమెరాలతో పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా
- ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి
నరసరావుపేట (పల్నాడు జిల్లా): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న 52 పంచాయతీల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. పోలింగ్ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసు శాఖ భరోసా కల్పించింది.
Be the first to share your thoughts on this story!