Monday, 30 November 2026
Header1
BREAKING

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 అమరావతి
📅 ప్రచురణ: 28 Nov 2026, 04:20 PM
🔄 నవీకరణ: 29 Nov 2026, 04:04 AM
👁️ 6 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

*స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లతో మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం* *పార్లమెంట్, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ల ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాము* *హోం మంత్రి వంగలపూడి అనిత*
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

అమరావతి, నవంబర్ 28  రాజధాని వాయిస్ :

మహిళా సాధికారత అనేది కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకూడదని, రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది సంపూర్ణమవుతుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా,నిర్ణయాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్రం మరో అడుగు వేయడాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వాగతించారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన సాధికారతకు పునాది అని అనిత పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు, స్థానిక పాలనలో కీలక పాత్ర పోషించేందుకు అవకాశాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో మహిళా నాయకత్వానికి బాటలు వేస్తూ కూటమి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం ముందుకు సాగడం సంతోషకరమని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు నిర్ణయాధికారంలో తగిన స్థానం లభించినప్పుడే సమాజంలో సమానత్వం, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలు కేవలం మార్పును కోరుకునే స్థాయిలో కాకుండా, ఆ మార్పును ముందుండి నడిపించే నాయకులుగా ఎదగాలని అనిత పిలుపునిచ్చారు. రాజకీయాలు, పాలన, అభివృద్ధి నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళలు మార్పులో భాగం కావడమే కాకుండా, మార్పుకు మార్గదర్శకులుగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1