Sunday, 22 November 2026
Header1
BREAKING

వీరుల మహోత్సవాలను విజయవంతగా జరిపించాలి.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 వెల్దుర్ది
📅 ప్రచురణ: 11 Nov 2026, 05:24 PM
🔄 నవీకరణ: 20 Nov 2026, 11:42 AM
👁️ 36 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

వెల్దుర్ది: 

డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే వీరుల మహోత్సవాలను విజయవంతంగా జరిపించాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. బుధవారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ్ అయ్యగారు, ఉత్సవ నిర్వాహక కమిటి సభ్యులు ఎమ్మెల్యే జూలకంటిని కలిసి, తిరునాళ్లకు సంబంధించి షెడ్యూల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా గోడపత్రులను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిరునాళ్ల సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు, మౌలిక వసతులు, బందోబస్తు, ఉత్సవాలు నిర్వహణ, ముఖ్య అతిథులకు ఆహ్వానాలు వంటి అంశాలపై ఆలయ నిర్వహకులు, గ్రామ పెద్దలతో చర్చించారు. వచ్చేే నెల 8 నుంచి 12 వరకు జరిగే తిరునాళ్లల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరునాళ్ల ప్రధాన ఘట్టాలలో 8న రాచగావు, 9న రాయబారం, 10న మందపోరు (చాపకూడు), 11న కోడిపోరు, 12న కల్లిపాడు వంటి ఉత్సవాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయకుమార్, పూజల గంగాథర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు శేషగిరిరావు, బవిరిశెట్టి రామారావు, బొమ్మెన శ్రీను, రాముడు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1