మాచర్ల నవంబర్ 4 రాజధాని వాయిస్
మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు అన్నీ వార్డులను క్లిన్ స్వీప్ చేస్తూ సాధించిన ఘన విజయం పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మరింత బాధ్యతను పెంచిందని శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్ధానిక మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు గానూ 36 వార్డు కౌన్సిలర్ స్ధానాలను, 23,191 ఓట్ల భారీ మెజారిటీతో చైర్పర్సన్ అభ్యర్ధి యెనుముల సుష్మాకేశవరెడ్డి అఖండ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం స్ధానిక నెహ్రునగర్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కౌన్సిలర్ సభ్యునితో ఒక్కో కేక్ చొప్పున 36 కేకులను వారి కుటుంబ సభ్యులు, గెలుపు సహకరించిన కూటమి శ్రేణులతో సమక్షంలో కట్ చేసి, ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్ అభ్యర్ధి సుష్మాకేశవరెడ్డి దంపతులతో భారీ కేక్ కట్ చేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.., భారీ మోజారిటీతో 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన సభ్యులందరూ పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

రెండేళ్ల ప్రజాపాలన మరింత విశ్వాన్ని పెంచింది..!
కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రజా పాలన చూసిన ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతపై మరింత విశ్వాసాన్ని పెంచుకున్నారని, విధ్వసమైన వ్యవస్థను గాడినపెట్టి.., సందప సృష్టించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదర్శపాలనను స్పూర్తిగా తీసుకుని కౌన్సిల్ సభ్యులు ప్రజాసేవలో పాటుపడాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎన్ని నీచమైన కుట్రలు పన్నినా స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. పట్టణ తాగునీటి అవసరాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ మెరుగుకు దాదాపు రూ.260 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నామన్నారు. రూ. 5 కోట్లతో పార్క్ లు, పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నామని వివరించారు.
పట్టణ సుందరీకరణకు కౌన్సిల్ సభ్యులు పాటుపడాలి..!
పట్టణంలో ఇరుకు రోడ్లన్నీ నేడు కూటమి ప్రభుత్వంలో విశాలమైన బైపాస్ రోడ్లుగా మారాయని, పచ్చదనం, విద్యుద్దీకరణతో మున్సిపాలిటీ సుందరీకరణకు కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని కోరారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి, గెలిపించినందుకు వారి విశ్వాన్ని మరింత పెంచేలా పాలన సాగించాలన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించేలా వారిని గుర్తించి, వాటిని అందేలా చూడాలన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మెనుముల సుష్మారెడ్డి, పార్టీ నాయకులు కేశవరెడ్డి, యువ నాయకులు గౌతమ్ జూలకంటి, కౌన్సిలర్లు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!