Sunday, 22 November 2026
Header1
BREAKING

రామోజీరావు ఆశయాలు స్పూర్తిదాయకం... నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 16 Nov 2026, 07:27 PM
🔄 నవీకరణ: 22 Nov 2026, 06:14 AM
👁️ 66 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):


వెల్దుర్తి.
నవంబర్ 16
రాజధాని వాయిస్ :

తెలుగు జర్నలిజానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన వ్యక్తి, పద్మభూషణ్ పురస్కార గ్రహిత చెరుకూరి రామోజీరావు ఆశయాలు స్పూర్తిదాయకమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. సోమవారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో రామోజీరావు జయంతి సందర్భంగా చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమాజహితానికి ఆయన అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. పత్రిక ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించి, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా రామోజీ నిలిచారని చెప్పుకొచ్చారు. తెలుగు మీడియా సంస్ధను జాతీయ స్థాయిలో మంచి స్ధానంలో నిలబెట్టిన దార్శనికుడు రామోజీ అని, ఆయన స్పూర్తివంతమైన జీవితాన్ని నేటి జర్నలిస్ట్ లు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1