Tuesday, 27 October 2026
Header1
BREAKING

30 సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్

* పోలింగ్, కౌంటింగ్ ల సందర్భంగా దుకాణాలు బంద్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 గుంటూరు
📅 ప్రచురణ: 26 Oct 2026, 01:18 PM
🔄 నవీకరణ: 26 Oct 2026, 05:09 PM
👁️ 10 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.

గుంటూరు, అక్టోబర్ 26 : 

గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం దుకాణాలలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల పోలింగ్ నవంబరు 1వ తేదీన జరుగుతున్నందున, నగర పాలక సంస్థల చట్టం 1955, రాష్ట్ర పురపాల చట్టం 1965 లలో గల నిబంధనల మేరకు విక్రయాలు నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.

నవంబరు 3వ తేదీన కౌంటింగ్ ఉన్నందున, 48 గంటల ముందు నుండి మద్యం విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X