దుర్గి, నవంబర్ 27, రాజధాని వాయిస్ :
మండల కేంద్రమైన దుర్గి లోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన సన్నని బీపీటీల బియ్యం తక్కువ ధరలకే అందజేస్తున్నారు. గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న సంగతులను గమనించి మానవతా దృక్పథంతో ఆలోచించి బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యాన్ని అందజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో హాజరయ్యారై బియ్యం సంచులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నాణ్యమైన బీపీటీల బియ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అనుగుణంగా బియ్యం విక్రయాలను అందజేస్తున్నట్లు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!