మాచర్ల, నవంబర్ 8
(రాజధాని వాయిస్):
మాచర్ల రింగ్ రోడ్డులోని రవితేజ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విలేకరుల కోసం హెల్త్ కార్డుల దరఖాస్తుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మిర్చి యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, లింగా కోటేశ్వరరావు, పలువురు వైద్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జర్నలిస్టుల సంక్షేమం ముఖ్యం
సమాజంలో నాలుగో స్తంభంగా నిరంతరం ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని, వారి సంక్షేమం కోసం ఆసుపత్రి యాజమాన్యం ముందుకొ రావడం అభినందనీయమని యాగంటి మల్లికార్జునరావు కొనియాడారు.విలేకరుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకే ఈ హెల్త్ కార్డులను అందిస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ శ్రీకాంత్, తెలిపారు. విలేకరులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రాయితీలతో పాటు 24 గంటలూ అత్యవసర వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- వైద్యుల సూచనలు
- పని ఒత్తిడి వల్ల జర్నలిస్టులు బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలని డాక్టర్ సుష్మ సూచించారు. ఈ కార్డు ద్వారా పరీక్షల్లో ప్రత్యేక రాయితీ లభిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఐజేఈ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ గాడిపర్తి శ్రీనివాసరావు, జర్నలిస్టులు మంగులూరి రాంబాబు, ఎమ్మెస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, విలేకరులను గుర్తించి హెల్త్ కార్డులు ఇస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గ విలేకరులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!