Sunday, 01 November 2026
Header1
BREAKING

టాప్ కిడ్స్ స్కూల్ ఆద్వర్యంలో మెగా క్రీడా సంబరం

రొమిట్ మెమోరియల్ ఛాంపియన్ షిప్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 01 Nov 2026, 08:11 AM
🔄 నవీకరణ: 01 Nov 2026, 11:20 AM
👁️ 26 views

టాప్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో మెగా క్రీడా సంబరం

రొమిట్ మెమోరియల్ ఛాంపియన్ షిప్

గుంటూరు.అక్టోబర్ 31,రాజధాని వాయిస్:

విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో గుంటూరు అడవితక్కెళ్లపాడు టాప్ కిడ్స్ స్కూల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రొమిట్ మెమోరియల్ పేరుతో తొలిసారిగా అంతర్ పాఠశాలల క్రీడా ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పోటీల్లో గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొననున్నారనిపాఠశాల ప్రిన్సిపాల్ జె. శేఖర్ బాబు వెల్లడించారు.విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఉండాలని, గెలుపు ఒక్కటే లక్ష్యం కాకుండా, ఓటమిని ధైర్యంగా స్వీకరించడం, ప్రత్యర్థులను గౌరవించడం, జట్టుగా పనిచేయడం వంటి విలువలు క్రీడల ద్వారానే అలవడతాయన్నారు.ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు కీలకమని, ఇలాంటి పోటీలు వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు చక్కని వేదికగా నిలుస్తాయని తెలిపారు.ఈ ఛాంపియన్‌షిప్‌కు క్రీడారంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగాహాజరుకానున్నారని,భారత వాలీబాల్ కెప్టెన్ వెంకటరమణ, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ సత్య గీత, భారత హాకీ కెప్టెన్ హర్ష, ఇండియన్ వాలీబాల్ కెప్టెన్ సింగారన్, ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ కుమార్, మాజీ ఇండియన్ త్రోబాల్ కెప్టెన్, గుంటూరు బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షురాలు రేవతి హాజరుకానున్నారని, విద్యార్థుల్లో కేవలం విద్యాపరమైన ప్రతిభ మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే క్రీడల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వివరాలకు9885064777 సంప్రదించండి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ థామస్ సెబాస్టియన్, డైరెక్టర్ లతా థామస్, ప్రిన్సిపాల్ జె. శేఖర్ బాబు, పీడీ మన్సూర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X