Monday, 24 August 2026
Telugu Daily
BREAKING

కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు

నరసరావుపేట.
ఆగస్టు 24
రాజధాని వాయిస్ :

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి అద్దయ్య తెలిపారు.
సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ అధికారి అద్దయ్య , జి ఎస్ డబ్ల్యూ ఎస్ శివారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పులిచింతల శ్రీరాములు రెడ్డి, డిపిఓ నాగేశ్వర నాయక్, పీజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ లీలారాణి ,అర్జీ దారుల నుండి 81 దరఖాస్తులు స్వీకరించారు . డిఆర్ఓ అద్దయ్య మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం గురించి ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తుందని, కావున అర్జీలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను కోరారు. అర్జీ ల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిశీలించి పరిష్కరిస్తేనే అర్జీ దారులు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు . అర్జీ నీ ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎ కు వెళ్లకుండా చూడాలని, అర్జీదారునికి తెలియకుండా ఎండార్స్మెంట్ చేసి అప్లోడ్ చేస్తే అర్జీ తిరిగి ఓపెన్ అవుతుందని తెలియజేశారు.

*రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు*

ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను కూడా ప్రాధాన్యలతో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సూచించారు. రెవిన్యూ క్లినిక్ కి సంబంధించి 35 దరఖాస్తులు స్వీకరించారు. (అందులో గురజాల-7, సత్తెనపల్లి- 9 ,నరసరావుపేట -19 దరఖాస్తులు ఉన్నాయి )సమస్యలు ధ్రువీకరణ పత్రాలు ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!