Monday, 24 August 2026
Telugu Daily
BREAKING

అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ

గుంటూరు.
ఆగస్టు 24
రాజధాని వాయిస్: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్వో ఖాజావలి, డి పి ఓ సాయికుమార్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, ఉచిత భోజన ఏర్పాట్లు కల్పించింది. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అర్జీదారులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!