Saturday, 21 November 2026
Header1
BREAKING

వరుస తుఫాన్లతో దెబ్బతిన్నాం... తక్షణ సాయం అందించండి..

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 17 Nov 2026, 06:14 PM
🔄 నవీకరణ: 20 Nov 2026, 10:40 AM
👁️ 14 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
రాయలసీమ హార్టికల్చర్ హబ్ కు నిధులు విడుదల చేయండి

వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీలో సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, నవంబర్ 17

 రెండు భారీ తుఫాన్ల తాకిడితో పంటలు సహా వివిధ రంగాలకు భారీ నష్టం సంభవించిందని.రాష్ట్రానికి తక్షణ ఆర్ధిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, హార్టికల్చర్ హబ్, పూర్వోదయ నిధులు విడుదల, ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు, ఆ సదస్సు వేదికగా తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి-కేంద్ర ఆర్థిక మంత్రి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రాన్ని ఇటీవల కాలంలో తాకిన ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల కలిగిన నష్టం గురించి సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. ఈ రెండు తుఫాన్ల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారమే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు చెప్పారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. చేతికందే పంట నీటి పాలైందని ముఖ్యమంత్రి వివరించారు. ఎల్ నినో ప్రభావం ఉన్నా... రైతులను గట్టెక్కించేందుకు పట్టిసీమ ద్వారా కొన్ని ప్రాంతాలకు సాగు నీరందించామని... కానీ తుఫాన్ల తాకిడితో పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దీంతో పాటు.. తీర ప్రాంతంలో మౌలిక వసతులు భారీ ఎత్తున దెబ్బతిన్నాయని. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ ఎక్కువగా నష్టపోయిందని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రానికి తుఫాన్ల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని... వారు కూడా వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణ సాయం అందించగలిగితే కొంత మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సీఎం చంద్రబాబు వివరించారు.
1004467182.jpg
Type image caption here...




*ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు*

కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రంలో చేపడుతోన్న అభివృద్ధి ప్రణాళికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల వారీగా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. దీంట్లో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ కు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హార్టికల్చర్ హబ్ లో భాగంగా వివిధ స్థాయిల్లో మౌళిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలకు రోడ్ నెట్ వర్క్, ఇరిగేషన్ అభివృద్ధి పనులు, డ్రిప్ ఇరిగేషన్ వంటి మీద ఫోకస్ పెట్టామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని... దీనికి ఇప్పటికే కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో సహకారం అందుతోందని.. దీనికి అదనంగా మరింత సాయం అందించగలిగితే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సు అంశం ప్రస్తావనకు వచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన పెట్టుబడులు, వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని నిర్మలా సీతారామన్ కు సీఎం వివరించారు. ఈ సదస్సు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడేలా ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు సహా ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1