Wednesday, 21 October 2026
Header1
BREAKING

పోలీసు అమరవీరుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Oct 2026, 04:29 PM
👁️ 1 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన వీరులకు ఘన నివాళులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

మంగళగిరి

రాజధాని వాయిస్ :

దేశ సరిహద్దుల రక్షణతో పాటు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తూ, వారి ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026 కార్యక్రమం మంగళగిరి ఏపీ ఎస్పీ 6 వ బెటాలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ..
అమరవీరులకు నివాళులర్పించేందుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
WhatsApp Image 2026-10-21 at 3.58.01 PM.jpeg

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన పది మంది వీరులు చైనా సైనికుల ఆకస్మిక దాడిని ధైర్యంగా ఎదుర్కొంటూ తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. వారి అసమాన త్యాగం భారత పోలీసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
ఆ వీరులకు వ్యక్తిగత భద్రత కంటే దేశ రక్షణే ముఖ్యమని, తమ ప్రాణాల కంటే విధి నిర్వహణకే ప్రాధాన్యతనిచ్చారని హోం మంత్రి తెలిపారు.

దేశ క్షేమం, ప్రజల భద్రత కోసం వారు ప్రదర్శించిన నిబద్ధత, ధైర్యం, అంకితభావం పోలీసు వ్యవస్థకు మార్గదర్శకమని పేర్కొన్నారు. 1959లో ప్రాణత్యాగం చేసిన పది మంది వీరుల స్మారకంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా నిర్వహిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పోలీసు అమరవీరుడి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రజల రక్షణకు, చట్ట పరిరక్షణకు, శాంతిభద్రతల నిర్వహణకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.

రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంతో పాటు ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారు చూపిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.

పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా నిలవాలని, సంక్షేమం, హక్కులు, భవిష్యత్తు భద్రతకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమం పట్ల పోలీసు శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా, వారి ఆశయాలను నిత్యం గుర్తుంచుకోవాలని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా అమరవీరుల పట్ల నిజమైన గౌరవాన్ని చాటుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

తొలుత అమరులు వారు పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, శాంతి భద్రత ఏడీజీ మధుసూదన్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది, అమరుల ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X