Tuesday, 20 October 2026
Header1
BREAKING

రేపు రేపల్లెలో టీడీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 23 Sep 2026, 04:06 PM
🔄 నవీకరణ: 25 Sep 2026, 05:21 AM
👁️ 120 views


రేపల్లె. సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్

స్థానిక వీరవల్లి ఫంక్షన్ హాల్‌లో గురువారం (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం 3:00 గంటలకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ పరిశీలకురాలు జయలక్ష్మి హాజరుకానున్నారు.
పార్టీ శ్రేణులతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని రేపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X