కారంపూడి సెప్టెంబర్ 21 రాజధాని వాయిస్ :
మండలంలోని పాఠశాలలో విద్యార్థుల ఆధార్ అప్డేట్ కొరకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి టి. రవికుమార్ సోమవారం తెలిపారు. ( మాండెట్రీ బయోమెట్రిక్ అప్డేట్) కార్యక్రమంలో భాగంగా ఎస్ జి ఎస్ డబ్ల్యూ వారి ఆధ్వర్యంలో నెలరోజులపాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు కారంపూడి లోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్, కస్తూర్బా గాంధీ పాఠశాల, మోడల్ స్కూల్, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్, దివ్య సాయి స్కూల్, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. షెడ్యూల్ ఇవ్వబడిన తేదీలలో విద్యార్థులు డాక్యుమెంట్లతో ఆధార్ అప్డేట్ చేయించుకోవచ్చు అని తెలిపారు. ఆధార్ కార్డులు లేని వారు, కార్డులలో తప్పులు సరి చేసుకోవడం సదుపాయాలు కల్పించినట్లు అని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సద్దునాగం చేసుకోవాలని ఆయన కోరారు.
Be the first to share your thoughts on this story!