రెంటచింతల:నవంబర్ 15 రాజధాని వాయిస్ :
పల్నాడు ప్రాంతంలో రెడ్డి సామాజీక ఉన్నతికి దివంగత జెడ్డా సీతారామిరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. ఆదివారం మండల పరిధిలోని ప్రముఖ శైవక్షేత్రం సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి వారి దేవస్ధానం ప్రాంగణంలో ఉన్న శ్రీ శివభక్త కుంటి మల్లారెడ్డి స్వామి వారి అన్నదాన సత్రం నందు సత్రం వ్యవస్ధాపకులు స్వర్గీయ జెడ్డా సీతారామిరెడ్డి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రముఖులు, కమిటీ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన సత్ర ప్రాంగణమంతా కలయతిరిగి.., చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కమిటి సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటి అధ్యక్షులు గొట్టం అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు గాదే వీరారెడ్డి, కమిటి సభ్యులు ఇంటూరు వెంకటేశ్వరరెడ్డి, పల్లె వెంకటరెడ్డి,బోయపాటి అంజిరెడ్డి, వట్టి కోటిరెడ్డి, సిద్దవాటం శివారెడ్డి, బరువు శివారెడ్డి, పులి ఓబులు రెడ్డి, చపారపు భాస్కర్ రెడ్డి, బరువు శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి, మండల నాయకులు చపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మున్నా ప్రభురాజు, మందలపు హనిమిరెడ్డి, బోడపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!