Tuesday, 20 October 2026
Header1
BREAKING

శభాష్ సాయి... బాల్ బ్యాడ్మింటన్ రాణిస్తున్నబీసీ విద్యార్థి సాయికుమార్

- మంత్రి సవిత అభినందనలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 23 Sep 2026, 06:01 PM
🔄 నవీకరణ: 25 Sep 2026, 11:04 AM
👁️ 110 views

తాడేపల్లి/అమరావతి : రాజధాని వాయిస్ :

ఈ నెల 9-13 తేదీల్లో మర్కాపురంలో జరిగిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించి... ఏపీ నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయికుమార్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అభినందించారు. బాల్ బ్యాడ్మింటన్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల విద్యార్థి, బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు సాయికుమార్, కోచ్ జూనా నాయక్, ప్రిన్సిపాల్ వై.రమేశ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 9-13 తేదీల్లో మర్కాపురంలో జరిగిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించి... జాతీయ పోటీలకు ఎంపికైనట్లు మంత్రి సవితకు సాయికుమార్ తెలిపాడు. వచ్చే నెల మూడో తేదీ నుంచి చత్తీస్ ఘడ్ లో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొనబోతున్నట్లు వివరించాడు. బాల్ బ్యాడ్మింటన్ లో రాణిస్తున్న బీసీ విద్యార్థి సాయికుమార్ ను మంత్రి సవిత కొత్త దుస్తులు అందజేసి, అభినందించి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించింది... రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో సాయికుమార్ కు మెళకువులు నేర్పిన కోచ్ జూనా నాయక్ ను, ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.రమేశ్ ను కూడా మంత్రి సవిత అభినందించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X