రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే వర్చువల్ గా బుధవారం శంకుస్థాపన జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నరసరావుపేట లోని భువన చంద్ర టౌన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల , నరసరావుపేట శాసన సభ్యుడు డా. చదలవాడ అరవింద్ బాబు వీక్షించారు.
జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో నరసరావుపేట పురపాలక సంఘంలో రూ. 37 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందని, నరసరావుపేట పురపాలక సంఘంలోని వివిధ వార్డులలో హెచ్ ఏ ఎం నిధులతో సెంట్రల్ డివైడర్లు , స్ట్రీట్ లైట్స్, పార్క్, మున్సిపల్ కార్యాలయ భవనం మరియు ఇతర అభివృద్ధి పనులైన 14.72 కి.మీ సి సి రోడ్ల నిర్మాణం , 0.24 కి.మీ బీటీ రోడ్డు , 13.88 కి.మీ సెంట్రల్ డివైడర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు వర్చువల్ గా నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
రానున్న 6 నెలలో పనులు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ పదకాలైన అమృత్ 2.0 , ఎస్ బి ఎం 2.0 మరియు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, డ్రైయిన్ల పనులకు కేటాయించిన రూ.45.11 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. పనులన్ని పూర్తి అయిన తర్వాత హెచ్ ఏ ఎం , యు ఐ డి ఎఫ్ – III & IV పధకం క్రింద రోడ్లు, డివైడర్లు , పార్కులు , వీధి దీపాలు , తాగునీటి సరఫరా , డ్రైయిన్ల పనులకు రానున్న రెండు సంవత్సరాలకు రూ.83 కోట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మొత్తంగా నరసరావుపేట పురపాలక సంఘం అభివృద్దికి రూ. 127.11 కోట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి విజన్ కు అనుగుణంగా , ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆయా పనులను నిర్దిష్ట సమయంలో పూర్తీ చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
నరసరావుపేటఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నరసరావుపేట పురపాలక సంఘం అభివృద్ధి పనులపై హెచ్ ఏ ఎం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తాగునీరు , డ్రైనేజ్ , రోడ్లు , లైటింగ్ , సెంట్రల్ డివైడర్ పనులకు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఇందుకు అందరు సహకరించాలని కోరారు. రానున్న రెండు సంవత్సరాలలో రూ. 127.11 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నామన్నారు. ఇప్పటికే రూ.45.11 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ ద్వారా రూ.37 కోట్లతో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు శంఖుస్థాపన చేశారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బాలకృష్ణ , మున్సిపల్ కమీషనర్ రమ్య కీర్తన , మాజీ మున్సిపల్ కమీషనర్ సుబ్బరాయ గుప్తా , ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు అల్లూరి సుబ్బారావు , మున్సిపల్ ఇంజనీర్ షేక్.మహమ్మద్ రఫీ , పుర ప్రముఖులు కల్పవాయి విజయ్ కుమార్, గట్టుపల్లి సత్యనారాయణ , బండారు పల్లి విశ్వేశ్వర రావు , ప్రజలు పాల్గొన్నారు.
నరసరావుపేట. సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే వర్చువల్ గా బుధవారం శంకుస్థ...
నరసరావుపేట. సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే వర్చువల్ గా బుధవారం శంకుస్థాపన జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నరసరావుపేట లోని భువన చంద్ర టౌన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల , నరసరావుపేట శాసన సభ్యుడు డా. చదలవాడ అరవింద్ బాబు వీక్షించారు.
జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో నరసరావుపేట పురపాలక సంఘంలో రూ. 37 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుందని, నరసరావుపేట పురపాలక సంఘంలోని వివిధ వార్డులలో హెచ్ ఏ ఎం నిధులతో సెంట్రల్ డివైడర్లు , స్ట్రీట్ లైట్స్, పార్క్, మున్సిపల్ కార్యాలయ భవనం మరియు ఇతర అభివృద్ధి పనులైన 14.72 కి.మీ సి సి రోడ్ల నిర్మాణం , 0.24 కి.మీ బీటీ రోడ్డు , 13.88 కి.మీ సెంట్రల్ డివైడర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు వర్చువల్ గా నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
రానున్న 6 నెలలో పనులు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ పదకాలైన అమృత్ 2.0 , ఎస్ బి ఎం 2.0 మరియు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, డ్రైయిన్ల పనులకు కేటాయించిన రూ.45.11 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. పనులన్ని పూర్తి అయిన తర్వాత హెచ్ ఏ ఎం , యు ఐ డి ఎఫ్ – III & IV పధకం క్రింద రోడ్లు, డివైడర్లు , పార్కులు , వీధి దీపాలు , తాగునీటి సరఫరా , డ్రైయిన్ల పనులకు రానున్న రెండు సంవత్సరాలకు రూ.83 కోట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మొత్తంగా నరసరావుపేట పురపాలక సంఘం అభివృద్దికి రూ. 127.11 కోట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి విజన్ కు అనుగుణంగా , ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆయా పనులను నిర్దిష్ట సమయంలో పూర్తీ చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
నరసరావుపేటఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నరసరావుపేట పురపాలక సంఘం అభివృద్ధి పనులపై హెచ్ ఏ ఎం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తాగునీరు , డ్రైనేజ్ , రోడ్లు , లైటింగ్ , సెంట్రల్ డివైడర్ పనులకు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఇందుకు అందరు సహకరించాలని కోరారు. రానున్న రెండు సంవత్సరాలలో రూ. 127.11 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నామన్నారు. ఇప్పటికే రూ.45.11 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ ద్వారా రూ.37 కోట్లతో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు శంఖుస్థాపన చేశారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బాలకృష్ణ , మున్సిపల్ కమీషనర్ రమ్య కీర్తన , మాజీ మున్సిపల్ కమీషనర్ సుబ్బరాయ గుప్తా , ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు అల్లూరి సుబ్బారావు , మున్సిపల్ ఇంజనీర్ షేక్.మహమ్మద్ రఫీ , పుర ప్రముఖులు కల్పవాయి విజయ్ కుమార్, గట్టుపల్లి సత్యనారాయణ , బండారు పల్లి విశ్వేశ్వర రావు , ప్రజలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!