Saturday, 21 November 2026
Header1
BREAKING

వెయిట్‌లిఫ్టింగ్‌లో న్యూటన్స్ విద్యార్థికి స్వర్ణం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 మాచర్ల
📅 ప్రచురణ: 16 Nov 2026, 04:26 PM
🔄 నవీకరణ: 18 Nov 2026, 06:23 AM
👁️ 13 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):


మాచర్ల(అలుగురాజుపల్లి ) :

 గుడివాడలో ఈ నెల 14న నిర్వహించిన జేఎన్‌టీయూ అంతర్ కళాశాల వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మాచర్ల న్యూటన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థి రాచమంటి రాకేష్ రణధీర్ యాదవ్ బంగారు పతకం సాధించాడు.

పోటీల్లో భాగంగా క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 110 కేజీలు, స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువును ఎత్తి విజేతగా నిలిచాడు. బీటెక్ సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న రణధీర్ యాదవ్ తన క్రీడా ప్రతిభతో కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చాడు.

విద్యార్థి సాధించిన విజయంపై కళాశాల కరస్పాండెంట్ శ్రీ జున్నా శ్రీనివాస రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ శ్రీ జున్నా చక్రధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఎస్. నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. నరసింహారావు, ఎ.ఓ షేక్ ఖాసీం, వివిధ విభాగాల అధిపతులు (HODలు), అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. రణధీర్ విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1