Tuesday, 20 October 2026
Header1
BREAKING

న్యూటన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం

- 214 మంది విద్యార్థుల రక్తదానం – రక్తదాతలకు పండ్లు, ప్రశంసాపత్రాల పంపిణీ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 29 Sep 2026, 06:13 PM
🔄 నవీకరణ: 10 Oct 2026, 06:28 PM
👁️ 124 views


మాచర్ల: సెప్టెంబర్ 29 రాజధాని వాయిస్ :

అలుగురాజుపల్లి గ్రామం, మాచర్ల మండలంలోని న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల మరియు గుంటూరుకు చెందిన తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కళాశాలకు చెందిన 214 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటుకున్నారు.
WhatsApp Image 2026-09-29 at 5.24.45 PM.jpeg

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్లకు చెందిన పాస్ట్ జిల్లా గవర్నర్ లయన్ ఎన్. గోపీచందు గారు, పాస్ట్ జిల్లా క్యాబినెట్ కార్యదర్శి లయన్ వెంకట సుబ్బయ్య గారు, గుంటూరుకు చెందిన తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ ప్రతినిధి శ్రీ శివాజీ గారు హాజరయ్యారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని వారు పేర్కొన్నారు.
WhatsApp Image 2026-09-29 at 5.24.46 PM (1).jpeg

రక్తదానం చేసిన విద్యార్థులకు అనంతరం పండ్లు, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. యువతలో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సంస్థ కార్యదర్శి శ్రీ జున్నా శ్రీనివాసరెడ్డి గారు, అకడమిక్ డైరెక్టర్ శ్రీ జున్నా చక్రధర్ రెడ్డి గారు, డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి గారు, మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ చారి గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నరసింహారావు గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. నరసింహారావు గారు, ఏవో శ్రీ ఖాసిం గారు, వివిధ విభాగాల అధిపతులు (హెచ్ఓడీలు), అధ్యాపకులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను, నిర్వాహకులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X