Saturday, 21 November 2026
Header1
BREAKING

అక్వాన్ తుపాన్‌పై ప్రభుత్వం అప్రమత్తం - తీరప్రాంత జిల్లాలకు హై అలర్ట్

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 17 Nov 2026, 12:07 PM
🔄 నవీకరణ: 20 Nov 2026, 08:07 AM
👁️ 12 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం.. - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
అమరావతి, నవంబర్ 17

 బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మంగళవారం విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల సమాచారం ప్రకారం అక్వాన్ తుపాన్ మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని అధికారులు హోంమంత్రికి వివరించారు. తుపాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, గతంలో సమష్టి కృషితో రెండు తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని, అదే స్ఫూర్తితో ప్రస్తుత తుపాన్‌ను కూడా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. విపత్తు సమయంలో ప్రభుత్వం ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రానున్న నాలుగు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. తీరప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వర్షాలు, ఈదురుగాలుల నుంచి కాపాడుకునేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు తగిన సూచనలు అందించాలని ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1