Saturday, 21 November 2026
Header1
BREAKING

నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పించిన వైద్యులు

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📍 మాచర్ల
📅 ప్రచురణ: 18 Nov 2026, 04:33 PM
🔄 నవీకరణ: 20 Nov 2026, 10:39 AM
👁️ 13 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

మాచర్ల, నవంబర్ 18:
జాతీయ నవజాత శిశువుల వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రసవం కోసం వచ్చిన తల్లులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారుల వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ రెడ్డి, డాక్టర్ ఆర్. రవి నాయక్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలను అందించాలని, తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని సూచించారు. కంగారూ మదర్ కేర్ పద్ధతి ద్వారా శిశువును తల్లి శరీరానికి దగ్గరగా ఉంచి వెచ్చదనాన్ని కల్పించాలని తెలిపారు. అదేవిధంగా శిశువుకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
శిశువుకు జ్వరం, కామెర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు.
నవజాత శిశువుల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, శిశు మరణాలను తగ్గించడం, ప్రతి బిడ్డకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వైద్యులు మెడికల్ సూపరింటెండెంట్ కె పి చారి తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1