తుళ్ళూరు నవంబర్ 17 రాజధాని వాయిస్ :
తుళ్ళూరు మండల కేంద్రమైన ఎం. పి. డి. ఓ కార్యాలయం నందు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ లో భాగంగా 17-11-26 న బాలల హక్కులు ప్రాధమిక విధులు అనే అంశం పై సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీ.సీ.పీ.ఓ గుంటూరు సి హెచ్.విజయ్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి బాలబాలికకు గౌరవప్రదమైన జీవితాన్ని, భద్రతను అందించడానికి కల్పించబడిన ప్రాథమిక హక్కులను బాలల హక్కులు అంటారని,భారత రాజ్యాంగం మరియు అంతర్జాతీయ ఒప్పందాల, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయని,భారత రాజ్యాంగం మరియు అంతర్జాతీయ చట్టాల ప్రకారం అత్యంత కీలకమైన అంశాలు పిల్లల రక్షణ, వికాసం కోసం హక్కులు ఉంటే, దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉండాల్సిన బాధ్యతలను ప్రాథమిక విధులు తెలియజేస్తాయని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి భారత పౌరుడికి 11 ప్రాథమిక విధులు ఉన్నాయని ఒక విద్యార్థిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా పిల్లలు పాటించాల్సిన ముఖ్యమైన విధులు ఏమనగా రాజ్యాంగం మరియు జాతీయ చిహ్నాలను గౌరవించడం,భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించడం వీటి పట్ల బాలలు బాధ్యతగా ఉండేవిధంగా ఇంట్లో,పాఠశాలలో ఉపాధ్యాయులు విధిగా బోధిస్తూ ఉండాలని అన్నారు. తరువాత మాట్లాడుతూ దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడటం కోసం కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడం కోసం,పర్యావరణ పరిరక్షణ లో భాగంగా అడవులు, నదులు, సరస్సులు మరియు వన్యప్రాణులతో సహా ప్రకృతిని కాపాడటం, జీవరాశుల పట్ల దయ కలిగి ఉండటం,శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని మూఢ నమ్మకాలను విడనాడి, శాస్త్రీయ ఆలోచన మానవతావాదం మరియు కొత్త విషయాలను నేర్చుకునే తత్వాన్ని పెంచుకోవడం,ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, పాఠశాలలు, పార్కులు, బస్సులు వంటి ప్రభుత్వ ఆస్తులను పాడుచేయకుండా కాపాడటం మరియు హింసను విడనాడటం వల్ల సమాజ అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు తరువాత గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సిస్టర్ విద్యా మాట్లాడుతూ వ్యక్తిగత మరియు సామూహిక ఉన్నతి చదువు, క్రీడలు మరియు ఇతర రంగాలలో రాణిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలనీ తల్లిదండ్రుల విధిగా పిల్లలకు బోధిస్తూ ఉండాలని,6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ప్రాథమిక విధి అని హక్కులు, విధుల మధ్య సంబంధంఒకే నాణేనికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని పిల్లలు తమ హక్కులను అనుభవిస్తూనే,తోటివారి హక్కులకు భంగం కలగకుండా తమ విధులను నిర్వర్తించినప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు డీసీపీ యూనిట్ నుండి బి.విజయ్ కుమార్ పివోఐసి,టి.దుర్గా భవాని పి వోఎన్ ఐ సి ఏ.సాయి కృష్ణ,డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ చైల్డ్ లైన్ ,కె.శ్రీనివాసరావు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్- తుళ్లూరు ,డా:శివపార్వతి-మెడికల్ ఆఫీసర్ తుళ్లూరు పి .హెచ్ సి , సతీష్,డిప్యూటీ తాసిల్దార్- తుళ్లూరు,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీలత, సీతారావమ్మ తుళ్లూరు మండల అంగన్వాడి టీచర్లు,సచివాలయం సిబ్బంది,మహిళా పోలీసులు, మరియు ఏ ఎన్ ఎం లు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిబ్బంది పి.అనిల్ కుమార్, ఎ. పోతురాజు, బి. విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!