గుంటూరు, నవంబరు 17 : రాజధాని వాయిస్ :
బయోచార్ ఫలితాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. సంక్షేమ, వ్యవసాయ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మార్పు" కార్యక్రమం క్రింద ఇప్పటికే నిర్ణయించిన మేరకు మస్క్విటో గార్డెన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా భవనాల వద్ద వర్షపునీటి పరిరక్షణ నిర్మాణాలు విధిగా ఉండాలని అన్నారు. సౌర విద్యుత్ వ్యవస్థ త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిసెంబరు నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
బయోచార్ క్రింద 19 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, 12 మంది ఇప్పటికే ప్రత్తి, మిరప, మినప, కంది, మునగ, జొన్న వేయడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో కొంత మంది రైతులు చేస్తున్నారని చెప్పారు.
Be the first to share your thoughts on this story!