Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

ముగ్గురికి తీవ్ర గాయాలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Aug 2026, 07:01 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 34 views
మాచర్ల. ఆగస్టు 25 రాజధాని వాయిస్: పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌లపై ప్రయాణిస్తున్న కె. వెంకటేశ్వర్లు (50), ఎన్. శేఖర్ (22), సిహెచ్. ఆనంద్ (21) రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X