Tuesday, 20 October 2026
Header1
BREAKING

బిసి రిజర్వేషన్ లపై వైసిపి గొడ్డలి పోటు

టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ ఎం.ఉమేష రావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 01 Oct 2026, 08:06 PM
🔄 నవీకరణ: 03 Oct 2026, 03:27 AM
👁️ 6 views
*బిసి రిజర్వేషన్ల పై వైసిపి గొడ్డలి పోటు*
-డా.యం.ఉమేష్ రావు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
*శ్రీకాళహస్తి*
అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేయడమే ఏకైక లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల వారికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కల్పించిన బీసీ రిజర్వేషన్ లపై తన వైసిపి చేత గొడ్డలి పోటు వేయించారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు.
*బిసి రిజర్వేషన్‌ చారిత్రాత్మకం*
అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా వెనుకబాటుకు గురైన వర్గాల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్రం లోని స్థానిక సంస్థలలో బీసీ వర్గాలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెం. 105 మరియు 1065 లను జారీ చేయడం చారిత్రాత్మకమైన నిర్ణయం అని కొనియాడారు. దీని వలన బీసీ వర్గాలకు రాజకీయ సాధికారత దక్కుతుందని, తద్వారా బీసీలు మోసే స్థాయి నుండి కూర్చునే స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని కొనియాడారు.
*బిసిల పక్షాన న్యాయ పోరాటం*
బీసీ నాయకత్వాల ఎదుగుదలను అస్సలు సమర్ధించని జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బీసీ లకు కల్పించిన 34% రిజర్వేషన్లను చూసి ఓర్చుకోలేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన మనుషుల చేత కోర్టులో కేసు వేయించి, వాటిని రద్దు చేయించడం దుర్మార్గమైన చర్యగా ఆరోపించారు. బీసీల పక్షపాతిగా కీర్తిని గడించిన సియం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీల న్యాయపరమైన రిజర్వేషన్లను కాపాడటానికి గౌరవ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి కృషి చేస్తారని తెలిపారు.
*బిసి నాయకత్వాలను అణచివేసిన వైసిపి*
అయిదు సంవత్సరాల వైసిపి అరాచక పాలనలో వెనుకబడిన వర్గాల పైన ఎన్ని దాడులు జరిగినా కనీసం స్పందన చూపని జగన్ రెడ్డి, తన నైజానికి తగ్గట్టుగా ఎంతోమంది బీసీ నాయకులను అతి కిరాతకంగా అంతమొందించి, బీసీ నాయకత్వాలను అణచివేశాడని ఆరోపించారు. ఇదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ బీసీ లకు కల్పించిన 34% రిజర్వేషన్లను అడ్డుకోవడానికి అతి భారీ కుట్ర చేశాడని ఆరోపించారు. తన పాలనాకాలంలో సరైన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే నాడు బీసీ రిజర్వేషన్లు 24% శాతానికి కుదించబడి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,000 వేల మంది బీసీ లు సర్పంచ్, ఎంపిటీసి, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఛైర్మన్ మరియు మేయర్ వంటి పదవులకు ప్రతినిధులు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
*న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్న వైసిపి*
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రాష్ట్రంలోని బీసీ లకు 34% రిజర్వేషన్ దక్కనీయకుండా చేసి, తద్వారా బీసీ నాయకత్వాలను రాజకీయంగా అణచి వేయడానికి కుట్ర చేసిన జగన్ రెడ్డి, తన వైసిపి సానుభూతిపరుల చేత కోర్టులలో కేసులు వేయించి, తప్పుడు సమాచారాన్ని అందించడం ద్వారా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి రిజర్వేషన్లను అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆరోపించారు.తన పాలనాకాలంలో ఎజిపి లుగా పనిచేసిన తన సొంత సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదుల చేత బీసీలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి ఆడిస్తున్న వికృత క్రీడకు బీసీలు తగిన విధంగా సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, యస్సీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు కయ్యూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X