- విపత్తు ప్రభావంపై సమగ్ర చర్యలు..!- శరవేగంగా కాలువ పనులు.., క్వారీకి తాగునీరు..!
మాచర్ల: సెప్టెంబర్ 13 రాజధాని వాయిస్ :
మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానాందరెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపాలిటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
సాధారణంగా మున్సిపల్ పంపుహౌస్ వద్ద 54 ఎకరాల్లో ఉన్న క్వారీకి వినాయకుడిగుట్ట వద్ద ఉన్న పంపు హౌస్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ దూరం నుంచి నీటి మోటర్ తో ఆర్సీసీ పైపులైన్ ద్వారా సాగర్ కుడి కాలువ కృష్ణ జలాలను తీసుకొస్తున్నారు. ఈనేపథ్యంలో 25 అడుగుల లోతు, 1300 మిలియన్ లీటర్ల వాటర్ కెపాసిటీ ఉన్న మున్సిపల్ క్వారీని నీటితో పూర్తిస్ధాయిలో నింపాలంటే దాదాపు రెండు నెల సమయం పడుతోంది.
ఈ క్రమంలో ఎన్ఎస్పీ అధికారులు ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల కోసం 15 రోజుల మాత్రమే కుడికాలువ నీటి సరాఫరా అని డెడ్ లైన్ విధించారు. ఎల్నినోతో తీవ్ర తాగునీటి కరువు పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయాల్లో పట్టణ పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది.
ఈ సమస్యను అధిగమించడానికి ఎమ్మెల్యే జూలకంటి ముందస్తు ఆలోచనలో భాగంగా లింగాపురం ప్రభుత్వ లే-అవుట్ వద్ద ఉన్న కుడి కాలువ నుంచి గ్రావిటి ద్వారా తాగునీరు తెచ్చేందుకు యుద్ద ప్రాతిపదికన కాలువ పనులు మొదలు పెట్టారు. భారీ జేసీబీలతో ప్రారంభించిన పనులు మూడు రోజుల్లో దాదాపు 80 శాతం పూర్తి అయ్యాయి. కుడికాలువ వద్ద 20-30 హెచ్పీ మోటర్ల సాయంతో నీటిని తోడి.., ముందుగా కాలువకు వదులుతారు.
తరువాత గ్రావిటి ద్వారా కాలువ నుంచి ఆర్టీసీ గ్యారేజ్ వద్దనున్న దేవళమ్మ చెరువుకు నీటిని తీసుకొస్తారు. అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటిని క్వారీకి తీసుకొస్తారు. ఇలా రెండో ప్రత్యమ్నాయం అందుబాటులోకి వస్తే.., వచ్చే ఏడాది జనవరి వరకు తాగునీటి ఎద్దడి ఉండకపోవచ్చునని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది.

Be the first to share your thoughts on this story!