Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాచర్లలో వైభవంగా శ్రీ శేషావతార మహా గణపతి ఉత్సవాలు: లక్కీ డ్రా కూపన్లు విడుదల

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 23 Sep 2026, 08:22 PM
🔄 నవీకరణ: 13 Oct 2026, 02:38 PM
👁️ 127 views
మాచర్ల (పాతూరు): సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్ :
మాచర్ల పాతూరులోని 30వ వార్డు, చిన్న రామాలయం వద్ద, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర శ్రీ సీతారామ గణేష్ సేవా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది స్వామివారు శ్రీ శేషావతార మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ ఉత్సవాలు ఈ నెల 14-09-2026 నుండి 25-09-2026 వరకు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, లక్కీ డ్రా మరియు ప్రసాద వితరణ జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.ఆకర్షణీయమైన బహుమతులతో లక్కీ డ్రా:ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ సీతారామ గణేష్ సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక లక్కీ డ్రా పోటీని నిర్వహిస్తున్నారు. ఈ కూపన్ ధరను కేవలం రూ. 100/- గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ కూపన్లు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. లక్కీ డ్రాలో విజేతలకు అందించే బహుమతుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
WhatsApp Image 2026-09-23 at 8.05.00 PM.jpeg
మొదటి బహుమతి: గణేష్ మహా లడ్డు (5 కేజీలు)ద్వితీయ బహుమతి: ఎలక్ట్రికల్ స్కూటీతృతీయ బహుమతి: ఫ్రిజ్ నాల్గవ  బహుమతి: వాటర్ ప్యూరిఫైయర్  ఐదవ బహుమతి: జర్మన్ సిల్వర్ పూజా సెట్ఆరవ బహుమతి: టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ఏడవ బహుమతి: మిక్సీఎనిమిదవ బహుమతి: స్టాండ్ ఫ్యాన్తొమ్మిదవ బహుమతి: అమ్మవారి పట్టుచీరెపదవ బహుమతి: స్మార్ట్ వాచ్-1లక్కీ డ్రా తేదీ & సమయం:ఈ లక్కీ డ్రాను 25-09-2026 (శుక్రవారం) సాయంత్రం 6:00 గంటలకు తీయడం జరుగుతుంది. డ్రాలో గెలుపొందిన విజేతలకు మాత్రమే బహుమతులు అందజేయబడతాయి.లక్కీ డ్రా కూపన్లు కావలసిన వారు మరియు ఇతర వివరాల కోసం క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు:9963666028, 6281454620, 9030428896. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు బత్తెనపాటి వాస్ దత్తు, ఓరుగంటి పురుషోత్తం, జాజుల నాగరాజు , వేముల భార్గవ్, చంద్రపట్ల సాయి రంగా కేదార్ లు ఆహ్వానిస్తున్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X