Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 06 Sep 2026, 07:09 AM
🔄 నవీకరణ: 13 Oct 2026, 03:56 PM
👁️ 130 views
ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
రాజుపాలెం.సెప్టెంబర్ 5,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాలలోని విద్యార్థులు  ప్రధానోపాధ్యాయులు ఫాదర్ ఇన్నారెడ్డి,ఫాదర్ అనిల్ ను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి అనేక విషయాలని ప్రసంగించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే ప్రేరణని, మార్గదర్శకులని, మా భవిష్యత్తుకు వారదిలాంటి వారిని, వారి జీవితమంతా విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటు అందించే వారని,భవిష్యత్తులో ఎవరెవరు ఏఏ ఉద్యోగాలలో స్థిరపడతారో, ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారో వివరించారు. గురుపూజోత్సవ సందర్భంగా విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆటల పోటీల్లో విజయం సాధించినటువంటి ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు. పాఠశాల యాజమాన్యం కూడా  ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులే మార్గదర్శకులన ఈ సందర్భంగా ఉత్తమ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా అవార్డుకు సెలెక్ట్ అయినటువంటి బట్టు శ్రీనివాసరావు  పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ రెవరెండ్ ఇన్నారెడ్డి, ఫాదర్ అనిల్, బాల సైదా, జ్యోతి రాజ్యలక్ష్మి, శిరీష, ప్రసాద్, శ్రీనివాసరావు, సిలార్ తదితరఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని చక్కగా అభినందించారు.
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/sfs

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X