Tuesday, 20 October 2026
Header1
BREAKING

బీసీలకు స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించడం హర్షణీయం

- కూటమి ప్రభుత్వానికి బీసీల తరఫున కృతజ్ఞతలు :మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 10 Oct 2026, 06:56 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 08:48 PM
👁️ 5 views

మాచర్ల అక్టోబర్ 10 రాజధాని వాయిస్ :
 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్నామని మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు తెలిపారు. రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేటాయింపులు చేపట్టడం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం బీసీలకు తగిన న్యాయం చేయలేదని విమర్శించిన కొమెర దుర్గారావు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశాలు కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయానికి బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

బీసీలకు సముచిత అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కొమెర దుర్గారావు కోరారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X