రేపల్లె. సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్ :
రాష్ట్రంలో పట్టణాల రూపురేఖలు మార్చేలా ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కుప్పం నుంచి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, సంబంధిత అధికారులతో కలిసి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో రూ.11,359 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సీఎం వర్చువల్ విధానం ద్వారా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రేపల్లె నియోజకవర్గ పరిధిలో రూ.30 కోట్ల వ్యయంతో పలు కీలక అభివృద్ధి పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రేపల్లెను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఈ నిధులతో నియోజకవర్గ ప్రగతి మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. రేపల్లె అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!