మాచర్ల, సెప్టెంబర్ 3:
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాదిగ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మాచర్ల క్రిస్టియన్పేటలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 32 గంటల పాటు జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు మాదిగ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, పొలం ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసిన అనంతరమే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు. ఇప్పటికైనా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన వ్యాఖ్యలపై మాదిగలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Be the first to share your thoughts on this story!