విజయపురిసౌత్ , సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్ :
విజయపురిసౌత్:ఐటిడిఏ శ్రీశైలం ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట స్వామి నాయుడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బెల్లంకొండ వారి పాలెం,ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (పి.టి.జి బాయ్స్) ను ఆకస్మికంగా తనిఖీ చేసినారు. పాఠశాల విద్యార్థులకు అందుతున్న భోజన వసతులను పరిశీలించారు. పాఠశాలకు సప్లై చేస్తున్న సరుకుల యొక్క నాణ్యతను కూడా పరిశీలించడమైనది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్ఎం టి వెంకటేశ్వర్లు సూచించడం అయినది. విద్యార్థులకు సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి వారికి విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు గురించి సూచనలు ఇవ్వడం జరిగింది.అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (పి.టి.జి బాయ్స్) కిచెన్ షెడ్ రిపేర్స్ పరిశీలించి త్వరగా పూర్తిచేయలని ఆదేశాలు ఇచ్చారు. వంట సిబ్బందితో మాట్లాడి మెనూ విషయములు పూర్తిగా అమలుపరచాలని డిప్యూటీ వార్డన్ కి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడి అకాడమిక్ విషయాలు తెలుసుకొని, పాఠశాలకు హాజరు కాకుండా ఇంటి వద్ద ఉన్న పిల్లలను వెంటనే బడికి పిలిపించాలని, తరగతి వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠశాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళే బాధ్యతను ఆయా హౌస్ మాస్టర్ మరియు క్లాస్ టీచర్స్ తీసుకోవాలని తెలిపారు.ఈకార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!